
ఐటీఐతో భవిష్యత్తు
–8లో
వృద్ధులకు.. వడదెబ్బ ముప్పు..
ఎండతీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. వేడిమి ప్రభావం ఎక్కువగా వృద్ధులపై పడి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది.
యువతకు వృత్తి విద్యకోర్సుల్లో శిక్షణ నైపుణ్యాన్ని అందించి స్వయం ఉపాధి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడంలో పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు కావాల్సిన భరోసా ఇస్తున్నాయి. ఐటీఐలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయి. అవసరమైన మెలకువలపై పట్టు సాధించడం, కోర్సులు పూర్తి కాగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభించడంతో స్వల్ప కాలిక వ్యవధిలోనే యువత జీవితాల్లో స్థిరపడి కుటుంబాలకు అండగా ఉంటున్నారు.
విజయనగరం రూరల్:
పదో తరగతి విద్యార్హతతో రెండు సంవత్సరాల కోర్సు చేసేందుకు విజయనగరం జిల్లా పరిధిలో మూడు ప్రభుత్వ, 25 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. విజయనగరం, బొబ్బిలి, రాజాం పట్టణాల్లో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు ఉండగా, జిల్లా కేంద్రంలో 6, కొత్తవలస మండలంలో 5, బొబ్బిలిలో 3, గజపతినగరంలో 2, ఎల్.కోటలో 2, ఎస్.కోటలో ఒక ఐటీఐ ఉన్నాయి. రామభద్రపురం, గరివిడి, చీపురుపల్లి, రాజాం, జామి, నరవ గ్రామాల్లో ఒక్కో ఐటీఐ ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో వివిధ కోర్సులలో 632 సీట్లు ఉండగా, ప్రైవేట్ ఐటీఐలలో 4,124 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
● ఐటీఐలో ట్రేడుల వివరాలు ఇలా..
ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానిక్, టర్నర్, మెషినిష్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్‌మెన్, సివిల్, ఏవో (కెమికల్), సర్వేయర్, పెయింటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి విద్యార్హతతో ఏడాది కోర్సు చేయడానికి కంప్యూటర్ ఆపరేటర్ ఆండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, డ్రెస్ మేకింగ్, డీజిల్ మెకానిక్, ఫైర్ టెక్నాలజీ ఆండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ అందుబాటులో ఉన్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్హతతో వెల్డర్, ఫ్లంబర్ ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
● ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పొంది అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. స్థానిక ఐటీఐల్లోనే కొన్నేళ్లుగా ప్రాంగణ ఎంపిక మేళాలు నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి పీఎంఎన్‌ఏ అప్రెంటిషిప్ మేళాలు నిర్వహిస్తున్నారు. వారికి శిక్షణ కాలంలో రూ.10 వేలు స్టైపెండ్ రూపేణా అందిస్తున్నారు. ప్రాంగణ ఎంపికల్లో ఎంపికై న విద్యార్థులకు చైన్నెలోని టీవీఎస్ సుందరం ఫార్టనర్స్, హైదరాబాద్‌లోని రేడియంట్ ఎలక్ట్రానిక్స్, క్యూసీఈవీ టెక్నాలజీస్ ఫర్ ఈవో వెహికల్స్, కడపలోని షిర్డీ సాయి ఎలక్ట్రానిక్స్, హైదరాబాద్‌లోని మేధో సెర్వో ఇండియా లిమిటెడ్, మైలాన్ ల్యాబొరేటరీస్, హెచ్‌బీఎల్ బ్యాటరీస్, డెక్కన్ ఫెర్రో, ఎల్ ఆండ్ టీ, విజయనగర్ బయోటెక్, జయభేరి, టాటా మోటార్స్, వరుణ్ మోటార్స్ వంటి సంస్థలతో పాటు మరెన్నో సంస్థలు ఉద్యోగ, అప్రెంటిస్ అవకాశాలు అందిస్తున్నారు.
● కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో..
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, స్టీల్‌ప్లాంట్, నావల్ డాక్‌యార్డ్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్, డీఆర్‌డీవో తదితర సంస్థల్లో టెక్నీషీయన్ ఉద్యోగాలకు ఐటీఐ అభ్యర్థులకు ఉమ్మడి రాష్ట్రం నుంచి 1000 ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తు ఇలా..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024– 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు జూన్ 10 లోగా ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనంతరం జూన్ 10 లోగా విద్యార్థులు వారికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలకు వెళ్లి ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలింపజేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో ఐటీఐ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఐటీఐ అధికారులు తెలిపారు.
మెండుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో ప్రవేశాలు ప్రారంభం
దరఖాస్తుల ఆహ్వానం
ఐటీఐ విద్యార్థులకు ప్రాధాన్యం
‘‘ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, అప్రెంటిస్ షిప్‌కు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ఏటా జిల్లాలో సుమారు 4వేల నుంచి 5వేల వరకు ఉద్యోగ, అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 4756 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించాం. విద్యార్థులు జూన్ 10 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
– టి.వి.గిరి, జిల్లా ఐటీఐ కళాశాలల కన్వీనరు

ఐటీఐతో భవిష్యత్తు

ఐటీఐతో భవిష్యత్తు

ఐటీఐతో భవిష్యత్తు

ఐటీఐతో భవిష్యత్తు

ఐటీఐతో భవిష్యత్తు