
ఎంఓయూ చేసుకున్న సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు
విజయనగరం అర్బన్:
విద్యార్థులు, అధ్యాపకులకు డ్రోన్ సాంకేతిక నైపుణ్యాభివృద్ధి కోసం రోసిస్ వర్చువల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరిందని సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (సీతం) డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు తెలిపారు. ఈ మేరకు స్థానిక కళాశాల ప్రాంగణంలో గురువారం ఆ సంస్థ ప్రతినిధులతో ఎంఓయూ జరిగిందన్నారు. డ్రోన్‌కు సంబంధించిన ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడం కోసం కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసీడీటీ (ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీస్) నిర్వహణకు దోహదం పడుతుందన్నారు. ఈ ఎంఓయూ ద్వారా 1,500 మంది విద్యార్ధులు, అధ్యాపకులకు డ్రోన్‌కు సంబంధించిన సాంకేతిక నైపుణ్యం మెరుగుపరచగలుగుతామన్నారు. సమావేశంలో రోసిస్ వర్చువల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఎస్‌కేవెంకట సతీష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీరామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ (అడ్మినిస్ట్రేషన్) డాక్టర్ డీవీవీఏ నాయుడు తదితరులు పాల్గొన్నారు.