సమాజ స్థితిగతులు తెలుసుకునేందుకే కులగణన | - | Sakshi
Sakshi News home page

సమాజ స్థితిగతులు తెలుసుకునేందుకే కులగణన

Nov 19 2023 12:44 AM | Updated on Nov 19 2023 12:44 AM

- - Sakshi

● జిల్లా స్థాయి సదస్సులో కలెక్టర్‌ నాగలక్ష్మి ● చరిత్రాత్మక నిర్ణయమన్న వివిధ వర్గాల ప్రతినిధులు

విజయనగరం అర్బన్‌: సమాజంలోని వివిధ వర్గాల స్థితిగతులను తెలుసుకునేందుకే ప్రభుత్వం కులగణన చేపడుతోందని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. కు లగణన–2023పై వివిధ కుల సంఘాలు, సంస్థల అభిప్రాయాలను తెలుసుకునేందుకు డీఆర్‌డీఏ స మావేశ మందిరంలో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ఈ నెల 27 నుంచి జిల్లాలో అత్యంత పా రదర్శకంగా కులగణన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దీనిని మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారం రోజులపాటు మూడు విధాలైన వివరాల సేకరణకు సర్వే చేస్తారన్నారు. అన్నికుటుంబాల వారు సహకరించాలని సూచించారు. వివరాలను తెలిపిన తరువాత కుటుంబానికి చెందిన ఎవరో ఒక వ్యక్తి వాటిని నిర్ధారిస్తూ బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుందని చెప్పారు. సేకరించిన వివరాలు గోప్యంగా భద్రంగా ఉంటాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

● రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణనకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూనుకోవడం శుభకరమన్నారు. కులగణనతో ఆయా వర్గాల జనాభాను బట్టి సంక్షేమ పథకాల అమలుకు అవకాశం కలుగుతుందన్నారు. కులసంఘాలన్నీ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. సదస్సులో జేసీ మయూర్‌ అశోక్‌, డీఆర్వో ఎస్‌.డి.అనిత, జిల్లా ముఖ్యప్రణాళికాధికారి జి.బాలాజీ, జిల్లా బీసీ సంక్షేమాధికారి సందీప్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ కె.రాజ్‌కుమార్‌, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి నిర్మలాదేవి, సంక్షేమశాఖ అధికారులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

కులగణన నిర్ణయం చరిత్రాత్మకం

రాష్ట్రంలో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేపడుతు న్న కులగణన ప్రక్రియ చరిత్రాత్మకమైనదని రాష్ట్ర కొప్పులవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, రాష్ట్ర శిష్టకరణ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కె.అనూషాపట్నాయక్‌ తదితరులు కొనియాడారు. ఇప్పటికే వివిధ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ సర్వేతో ఆయా వర్గాలకు మరింత ప్రయోజనాన్ని చేకూర్చనున్నారని చెప్పారు. సమావేశంలో వివిధ కార్పొరేషన్ల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement