
సంకల్పర్యాలీ కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం: సామాజిక న్యాయమే ఊపిరిగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తు న్నారని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయవాడలోని స్వరాజ్యమైదానంలో సుమారు రూ.255 కోట్ల వ్యయంతో 125 అడుగుల నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంబేడ్కర్ అందరివాడు సాధన సమితి, ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాలను కోలగట్ల మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడితో విగ్ర హం నిర్మిస్తుండడం సంతోషదాయకమన్నారు. సుమా రు 18 ఎకరాల్లో చేపడుతున్న అంబేడ్కర్ స్మృతి వనంలో మెమోరియల్ హాల్, మెమోరియల్ లైబ్రరీ, స్టడీ సెంటర్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 13న జైభీమ్‌లతో జిల్లా కేంద్రంలో నిర్వహించే సంకల్ప ర్యాలీని విజయవంతం చేయాలన్యానరు. కార్యక్రమంలో సాధన సమితి ప్రతినిధులు బి.భానుమూర్తి, మల్లన సంతోష్, జి.వీర్రాజు, ఉత్తరాంధ్ర అంబేడ్కర్ రైట్స్ కన్వీనర్ పి.వెంకటరమణ, కార్పొరేటర్లు పి.శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి, డి.సత్యవతి, ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు పి.చంద్రశేఖర్, అప్పారావు, సింహాద్రి పాల్గొన్నారు.