
క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులు
విజయనగరం అర్బన్: పట్టణంలోని మహారాజా అటానమస్ కళాశాలలో మంగళవారం జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో 430 మందికి ఉద్యోగాలు లభించాయి. తునిలోని నక్కపల్లి సమీపంలో ఉన్న హెటిరో ఫార్మా కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఐటీఐ డిప్లమో విద్యార్థులు 598 మంది హాజరయ్యారు. వీరిలో అర్హులైన 430 మంది సంస్థలోని క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ విభాగాల్లో ఏడాదికి రూ.2.6 లక్షల నుంచి రూ.2.90 లక్షల జీతానికి ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.సాంబశివరావు తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్లు రాజు, మణికంఠ, హరితోపాటు కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అధికారి కె.రాజుసంతోష్, అధ్యాపకులు డాక్టర్ బి.దిలీప్‌కుమార్, పి.నూకరాజు, రాము, శంకరరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.