
–8లో
పాడి రైతుకు వరం..
సంచార వాహనం
పాడిరైతులకు సహాయకారిగా మెలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత మేలుచేసే
నిర్ణయాలు తీసుకుంటోంది.
హత్య పథకం బట్టబయలు
పాతకక్షల నేపథ్యంలో ఒక వ్యక్తిని హతమార్చేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్రను పోలీసులు
బట్టబయలు చేశారు.
–8లో
బుధవారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2023
వరుడు : శ్రీరామచంద్రుడు
వధువు : సీతాదేవి
వేదిక : సీతారామస్వామివారి కల్యాణ మండపం,
రామతీర్థం
సమయం : 30వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు
సుముహుర్తం : 12 గంటలకు
అభిజిత్ లగ్నం
అభ్యర్థన : వేదపండితుల వేదమంత్రోచ్చారణ నడుమ జరిగే సీతారామచంద్రమూర్తి కల్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి సీతాసమేత రామస్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని మనవి.
ఇఫ్తార్ సహర్
బుధ (సాశ్రీశ్రీ) గురు (ఉశ్రీశ్రీ)
6:15 4:32
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో గురువారం జరగనున్న సీతారాముల కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తజనం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. రామస్వామి వారి దేవస్థానం సమీపంలోని స్వామివారి కల్యాణ మండపంలో గురువారం ఉదయం 10.30 నుంచి 12.30 వరుకు సీతారామస్వామివారి పరిణయ ఘట్టం జరగనుంది. ప్రత్యేక పూజలనంతరం మధ్యాహ్నం 12గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామి కల్యాణాన్ని అర్చకులు జరిపించనున్నారు. కల్యాణం నిర్వహించే వేదికను సుందరంగా అలంకరిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, ముత్యాల తలంబ్రాల పంపిణీకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి ఆలయానికి కల్యాణశోభ సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమా రు 25 మంది రుత్వికులు నిర్విరామంగా పారాయణాలు జరుపుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామికి లక్షతులసీ దళార్చన, కుంకుమార్చన పూజలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగే సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్నిఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. టెంట్ల ఏర్పాటుతో పాటు దర్శనం కోసం భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక క్యూలు సిద్ధం చేశారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
స్వామివారి దర్శనం ఇలా...
తూర్పుగోపురం ద్వారా రూ.50 టికెట్లు తీసుకునే భక్తులను ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. ఉచిత దర్శనం దక్షిణ గోపురం ద్వారా అనుమతిస్తారు. సీతారామచంద్రస్వామి వారి కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు వివిధ రకాల సదుపాయాలు కల్పించారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ఎండ తీవ్రత దష్ట్యా కల్యాణ ప్రాంగణంలో స్వామివారి కల్యాణాన్ని భక్తులు తిలకించేందుకు టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూర్చునే వద్ద చల్లగా ఉండేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చుతున్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చిన్న పిల్లలకు పాలు అందించనున్నారు. సతివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యశిబిరాన్ని నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవాలి....
విజయనగరం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి రామతీర్థం చేరుకోవచ్చు. ఆటోల్లో వచ్చే వారు మూడు లాంతర్లు కూడలి నుంచి నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌కు చేరుకొని అక్కడ నుంచి 5 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రణస్థలం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి సతివాడ మీదుగా రామతీర్థానికి చేరుకోవాలి.
న్యూస్‌రీల్
ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి వేడుకలు
రామతీర్థం తరలిరానున్న ప్రముఖులు
తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు
తిరుపతి నుంచి చేరుకున్న పట్టువస్త్రాలు
ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను
సమర్పించనున్న బొత్స దంపతులు
తిరుపతి నుంచి వచ్చిన పట్టువస్త్రాలు
ఏటా జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలకు తిరుపతితో పాటు సింహాచలం సింహాద్రి అప్పన దేవాలయం నుంచి పట్టువస్త్రాలు తేవడం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి నుంచి స్వామి వారి పట్టువస్త్రాలను అర్చకలు ఇటీవల తీసుకువచ్చారు. కల్యాణం రోజున సింహాచలం అప్పన్న స్వామి సన్నిధి నుంచి రామతీర్థానికి పట్టువస్త్రాలు తెస్తారు. వీటిని ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున
స్వామివారికి సమర్పించనున్నారు.
గట్టి బందోబస్తు...
శ్రీరామనవమి రోజున రామతీర్థంలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటాం. 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తాం. డీఎస్పీ స్థాయి అధికారి, ఏడుగురు ఎస్‌ఐలు, ముగ్గురు సీఐలు తమ విధులను నిర్వర్తించనున్నారు. సుమారు 20వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం. కల్యాణం సజావుగా సాగేందుకు భక్తులు సహకరించాలి.
– నారాయణరావు,ఎస్‌ఐ, నెల్లిమర్ల
అభిజిత్ లగ్నంలో కల్యాణం..
కల్యాణ వేదిక వద్ద ఉదయం 10.30 నుంచి శాస్త్రోక్తంగా కల్యాణ మహోత్సవ పూజలు ప్రారంభిస్తాం. సరిగ్గా 12 గంటలకు అభిజత్ లగ్నంలో స్వామి కల్యాణ వేడుకను శాస్త్రోక్తంగా జరిపించనున్నాం. తిరుమల నుంచి పట్టు వస్త్రాలు రామతీర్థం చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్యాణం రోజున సింహాచలం అప్పన్నస్వామి సన్నిధి నుంచి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రానున్నాయి.
– కిరణ్‌కుమారాచార్యులు,
అర్చకులు, రామతీర్థం
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా..
కల్యాణాన్ని వీక్షించేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 18వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపడుతున్నాం. భక్తులకు మంచినీరు, మజ్జిగ, చిన్న పిల్లలకు పాలు, తలంబ్రాల పంపిణీకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు, ఉచిత ప్రసాదాల పంపిణీ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నాం. దేవదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను కల్యాణానికి ఆహ్వానించాం.
– కిశోర్‌కుమార్, ఈఓ, రామతీర్థం
పవిత్ర గోటి తలంబ్రాలు సమర్పణ
శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో గురువారం జరగనున్న సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా, కిర్లంపూడి మండలంలోని జగపతినగరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ప్రత్యేకంగా సేద్యం చేసి గోటితో వలిచిన పవిత్ర తలంబ్రాలను ఈఓ కిశోర్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో భజన బృంద ప్రతినిధి పైడిరాజు పాల్గొన్నారు.


కల్యాణ వేదిక ప్రాంగాణం చుట్టూ షామియానాల ఏర్పాటు

ఈఓ ప్రసాదరావుకు పవిత్ర గోటి తలంబ్రాలను అందజేస్తున్న భక్తులు

ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు


