
బంగారుపతకాలు, కుటుంబసభ్యులతో సాయికీర్తన
విజయనగరం పూల్‌బాగ్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు మంగళవారం జరిగిన కెమిస్ట్రీ–1, కామర్స్–1, సోషియాలజీ–1, ఫైన్ ఆర్ట్స్ మూజిక్ పేపర్–1 పరీక్షకు విజయనగరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,024 మంది విద్యార్థులు హాజరుకాగా, 1268 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ ఐదు పరీక్ష కేంద్రాలను, డీఈసీ మూడు కేంద్రాలను తనిఖీ చేశారు. స్క్వాడ్ బృందాలు 42, ఇతర అధికారులు 8 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన నలుగురిని డీబార్ చేసినట్టు ఆర్‌ఐఓ ఎం.సత్యనారాయణ తెలిపారు.
శివడవలస విద్యార్థిని ప్రతిభ
● వరుసగా నాలుగు సార్లు గోల్డ్‌మెడల్ సాధించిన మెడికో
బొబ్బిలి రూరల్: మండలంలోని శివడవలసకు చెందిన విద్యార్థిని కర్రి సాయికీర్తన విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువులో ప్రతిభ చూపింది. నాలుగేళ్లుగా డిస్టింక్షన్‌లో పాసై నాలుగు బంగారు పతకాలు సాధించింది. విద్యార్థిని తండ్రి కన్నంనాయుడు వైద్యుడు కాగా తల్లి రాణీదేవి గృహిణి. ఆమె ఇద్దరు చెల్లెళ్లు (కవలలు) ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. చదువులో విశేషప్రతిభ సాధించిన సాయికీర్తనను పలువురు అభినందించారు.