
చీపురుపల్లి రూరల్: బోల్తా పడిన ఆటో
చీపురుపల్లిరూరల్(గరివిడి)/కొత్తవలస/బొబ్బిలి: విజయనగరం జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పలువురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. ఆయా ప్రమాద సంఘటనలపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఆటో బోల్తా పడి..
గరివిడి మండలంలోని కుమరాం–ఆకులపేట రహదారిలో ఆటో బోల్తా పడి పలువురు మహిళలు గాయాలపాలయ్యారు. గరివిడి మండలంలోని ఎం.దుగ్గివలస గ్రామానికి చెందిన ఎం.హరికృష్ణ ఆటో కొనుగోలు చేసి మంచి ముహూర్తం కోసం అదే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలను ఎక్కించి కొన్ని దేవాలయాలకు తీసుకువెళ్లాడు. అలా దేవాలయాలకు తీసుకువెళ్తున్న క్రమంలో కుమరాం రహదారిలో గల మలుపు వద్ద ఆటో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో కింద మహిళలు ఉండిపోవడంతో స్థానిక యువత గమనించి ఆటోలో నుంచి వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆటోలో కూర్చున్న ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలు కాగా మన్నిపురి సత్యవతి, మన్నిపురి సావిత్రిలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన వారిద్దరిని 108లో చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి విజయనగరం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
బస్సు ఢీకొని..
బొబ్బిలి పట్టణంలోని ఫ్‌లైఓవర్ వద్ద పాకి వీధికి చెందిన చలుమూరి రాము బైక్‌పై వెళ్తూ ఫ్‌లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఢీకొనడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడ్ని ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్..
కొత్తవలస–విజయనగరం రోడ్డులో అర్ధాన్నపాలెం గ్రామం సమీపంలో ద్విచక్రవాహనాన్ని వ్యాన్ బలంగా డీకొట్టడంతో ద్విచక్రవాహన చోదకుడు గొంప కృష్ణ తీవ్ర గాయాల పాలయ్యాడు. గొంప కృష్ణ ద్విచక్రవాహనంపై కంటకాపల్లి నుంచి స్వగ్రామం గొల్లపేట వస్తుండగా కొత్తవలస నుంచి విజయనగరం వైపు మితిమీరిన వేగంతో వెళ్తున్న వ్యాన్ బలంగా ఢీకొట్టింది. దీంతో కృష్ణ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కొత్తవలసలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లారు.
కోడిగుడ్ల ధరలు
చికెన్

బొబ్బిలి: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

