
పౌష్టికాహారాన్ని అందిస్తున్న రామేశ్వరి ప్రభు, శ్యామ్‌ప్రసాద్
● డీఎల్‌ఓ రామేశ్వరి ప్రభు, డీఎల్‌ఓ శ్యామ్‌ప్రసాద్
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ బాధితులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని విజయనగరం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ రామేశ్వరి ప్రభు, పార్వతీపురం మన్యం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ సూచించారు. స్థానిక విజయ పాజిటివ్ నెట్‌వర్క్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు పౌష్టికాహార కిట్లను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్‌ఐవీపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకూడదని కోరారు. హెచ్‌ఐవీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఆర్‌టీ మందులు క్రమం తప్పకుండా వాడుతూ మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా జీవితకాలాన్ని పెంచుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో విజయ నెట్‌వర్క్ సంస్థ ప్రతినిధులు చౌదరి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.