● సీబీసీఎన్‌సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ జాన్
విజయనగరం టౌన్: సీబీసీఎన్‌సీ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే సహించేది లేదని సీబీసీఎన్ సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆర్.ఎస్. జాన్ పేర్కొన్నారు. స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో ఆదివారం సీబీసీఎన్‌సీ నేత్రత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. సీబీసీఎన్‌సీ నేడు అనేక వర్గాలుగా విడిపో యి ఐక్యత కోల్పోయి సంస్థ ఔన్నత్యాన్ని నీరుగార్చే విధంగా తయారైందన్నారు. ఈ క్రమంలో విశాఖలోని హిల్‌క్రస్ట్ బంగ్లా సీబీసీఎన్‌సీ స్ధలంలో ఉందని, దానికి భూమిపూజ చేసేందుకు రంగం సిద్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసు కుని ఆస్తుల పరిరక్షణకు పాటుపడాలని కోరా రు. పాస్టర్ ఎం.అప్పలనాయుడు, జయరత్నకు మార్, టి.ఆనందరావు, టి.డేనీ పాల్గొన్నారు.
‘అమృత్ జలధార’ గడువు నేటితో పూర్తి
విజయనగరం పూల్‌బాగ్: అమృత్ జలధార పథకం కింద నీటి వసతులు లేని షెడ్యూల్డ్ కులాలకు చెందిన రైతుల భూములకు నీటి వసతులు కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.సుధారాణి ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఖరీదు లో 50శాతం సబ్సిడీతోగానీ, రూ.50 వేలు మించకుండా ఏది తక్కువైతే అది అదనంగా సబ్సిడీ మంజూరు చేయబడుతుందన్నారు. ఈ పథకానికి 2 ఎకరాల 50 సెంట్లు భూమి ఒకరికీగానీ అంతకంటే ఎక్కువ మందికి పక్కపక్కనే భూములు ఉన్న రైతులు అర్హులని పేర్కొన్నారు. సర్పేస్ ఇరిగేషన్, ఇన్‌క్లూడింగ్ డ్రిప్ లేదా స్ప్రింక్లర్ ఇరిగేషన్ కింద రుణాలు పొందిన లబ్ధిదారులు మాత్రమే దీనికి అర్హులని పేర్కొన్నారు. కులం, ఆదాయం, తెలుపు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పట్టాదారు పాస్‌బుక్ తదితర అంశాల జెరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 27లోగా తమ కార్యాలయంలో అందజేయాలన్నారు.