
పూసపాటిరేగ: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలకు చెందిన డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఇనపకుర్తి చిన సత్యనారాయణకు జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. విజయవాడకు చెందిన డ్రీమ్ చిల్డ్రన్ యూత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వరంలో ఆదివారం అక్కడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ గీసిన చిత్రానికి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సెర్ప్ డైరెక్టర్ ఎంఎం ఇంతియాజ్ చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకున్నారు.ఉత్తమ అవార్డు వచ్చినందుకు పాఠశాల హెచ్‌ఎం శంకర్రావుతో పాటు ఇతర ఉపాధ్యాయులు డ్రాయింగ్ ఉపాధ్యాయుడు సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ ఎగ్జామ్స్ డైరెక్టర్ దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.