భారత్–శ్రీలంక క్రీడాకారుల ప్రాక్టీస్
విశాఖ స్పోర్ట్స్: విశాఖ వేదికగా భారత్–శ్రీలంక మహిళా జట్ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక టీ20 సిరీస్ సందడి మొదలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ 21న, రెండో మ్యాచ్ 23న ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరగనున్నాయి. ఈ పోటీల కోసం ఇరుజట్లు గురువారం స్థానిక స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. శ్రీలంక మహిళా జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మైదానంలో కసరత్తులు చేయగా, అనంతరం భారత జట్టు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఫిట్‌నెస్‌తో పాటు ప్రాక్టీస్ నిర్వహించింది. శిక్షణ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు నోవాటెల్‌కు, శ్రీలంక ఆటగాళ్లు షెర్టాన్ హోటల్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఇండియన్ టీం ఆంధ్రాయూనివర్సిటీని సందర్శించింది. అక్కడ విద్యార్థులతో కాసేపు గడిపింది.
స్టేడియంలో ప్రాక్టీస్
భారత్–శ్రీలంక క్రీడాకారుల ప్రాక్టీస్
భారత్–శ్రీలంక క్రీడాకారుల ప్రాక్టీస్


