జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనకు ‘శ్రీకృష్ణాపురం’ ప్రాజె
ఆరిలోవ: శ్రీకృష్ణాపురంలోని డా.బి.ఆర్. అంబేడ్కర్ గురుకులం పూర్వ విద్యార్థి రూపొందించిన గణిత ప్రాజెక్టు జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనకు ఎంపికై ంది. గణిత ఉపాధ్యాయుడు సంపతిరావు సారథ్యంలో 10వ తరగతి పూర్వ విద్యార్థి(2024) పొన్నకాయల ఆకాష్ ‘స్వచ్ఛ భారత్‌పై’ఈ గణిత శాస్త్ర ప్రాజెక్టును తయారు చేశాడు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే గతేడాది జరిగిన మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. విద్యార్థి ఆకాష్, ఉపాధ్యాయుడు సంపతిరావు ఈ నెల 18 నుంచి 24 వరకు భోపాల్‌లో జరగనున్న జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలో పాల్గొనేందుకు శనివారం బయలుదేరారు. ప్రస్తుతం ఆకాష్ విజయవాడ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ సందర్భంగా గురుకులం ప్రిన్సిపాల్ రత్నవల్లి మాట్లాడుతూ రాష్ట్ర గురుకులాల చరిత్రలో 40 ఏళ్ల తర్వాత జాతీయ స్థాయి ప్రదర్శనకు ప్రాజెక్టు ఎంపికవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.


