 
															జీవీఎంసీ పరిధిలో..
డాబాగార్డెన్స్: మోంథా తుపాను నేపథ్యంలో జీవీఎంసీ పలు సహాయక చర్యలు చేపట్టింది. ఆయా జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన 13 పునరావాస కేంద్రాలకు మొత్తం 138 మందిని నిర్వాసితులను తరలించింది. వివిధ ప్రాంతాల్లో 161 చెట్లు కూలిపోగా అధికారులు వెంటనే 157 చెట్లను క్లియర్ చేయించారు. పడిపోయిన 10 విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించారు. ప్రజల నుంచి యూజీడీకి సంబంధించి 20 ఫిర్యాదులు రాగా 19 పరిష్కరించారు. వర్షం నీరు నిలిచిపోయిన 30 ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కూలిపోయిన 8 ప్రహరీలను క్లియర్ చేశారు. తుపాను కారణంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా 229 ఫిర్యాదులు అందగా 224 పరిష్కరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
