 
															తుపాను బాధితులకు పరిహారం అందించాలి
సాక్షి, విశాఖపట్నం: మోంథా తుపాను ప్రభావంతో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. పంట నష్టపోయి, ఇళ్లు ధ్వంసమై కష్టాల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వం తక్షణం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్, మజ్జి శ్రీనివాసరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, ధర్మశ్రీతో పాటు పలువురు ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోంథా తుపాను వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. తుపాను బాధితులను పరామర్శించి, సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలందరినీ అభినందించారు. ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని మరోసారి నిరూపించాయంటూ ప్రశంసించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో డిప్యూటీ మేయర్ కె.సతీష్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, ఎస్‌ఈసీ సభ్యులు ఐహెచ్ ఫరూఖీ, సతీష్ వర్మ, పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర, జోనల్ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేర్ల విజయ్ చందర్, ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్న జానకిరామ్, కార్పొరేటర్లు బర్కత్ అలీ, శశికళ, మహమ్మద్ ఇమ్రాన్, బిపిన్ కుమార్, జోనల్ యువజన జోనల్ ఇన్‌చార్జి అంబటి శైలేష్, జిల్లా పార్టీ కమిటీ అధికార ప్రతినిధులు ఆల్ఫా కృష్ణ, పల్లా దుర్గ, మంచ నాగమల్లేశ్వరి, హరి కిరణ్ రెడ్డి, జిల్లా అనుబంధ కమిటీ అధ్యక్షులు బోని శివరామకృష్ణ, నీలి రవి, సనపల రవీంద్ర భరత్, శ్రీదేవి వర్మ, శంకర్ బత్తుల ప్రసాద్, మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, సకలబత్తుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
