 
															హార్బర్‌లో మునిగిన మరబోటు
మహారాణిపేట: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోని సెంట్రల్ డాక్ ఏరియాలో నిలిపి ఉంచిన ఒక మరబోటు మోంథా తుపాను ప్రభావం కారణంగా నీటిలో మునిగిపోయింది. మరమ్మతుల కోసం హార్బర్‌లో ఉంచిన ఈ బోటు పూర్తిగా దెబ్బతినడంతో రాష్ట్ర మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లక్ష్మయ్య స్పందించారు. మునిగిపోయిన ఐఎన్‌డీ ఏపీ వీ5 ఎంఎం–90 నంబరు గల మరబోటు యాజమాని మేరుగు ధనరాజుకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మునిగిపోయిన బోటును పరిశీలించడంతో పాటు, బాధిత బోటు యజమానిని పరామర్శించారు. ఈ సంఘటన తమ దృష్టికి కూడా వచ్చిందని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
