క్రికెట్ లైవ్.. ఆర్ట్ క్రియేటివ్
విశాఖ స్పోర్ట్స్: సాధారణంగా అంతర్జాతీయ క్రీడా మ్యాచ్‌ల్లోని ముఖ్య సంఘటనలను సజీవంగా కాన్వా స్‌పై చిత్రించే సంస్కృతి విదేశాల్లో అధికంగా కనిపిస్తుంది. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. విశాఖ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ చివరి రోజు మ్యాచ్ సందర్భంగా ఓ కళాత్మక కార్యక్రమం జరిగింది. స్థానిక ఇంజినీరింగ్ విద్యార్థులు కలిసి ‘కళాకృతి క్రియేటివ్ ఆర్ట్స్ క్లబ్’గా ఏర్పడి ఆదివారం ఈ లైవ్ పెయింటింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్లబ్‌లోని 16 మంది ఔత్సాహిక విద్యా ర్థులు మ్యాచ్ జరుగుతున్న తీరును, క్రీడాకారుల ఉత్సాహాన్ని, స్టేడియం వాతావరణాన్ని ప్రత్యక్షంగా చిత్రీకరించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ బృందం మొత్తంగా ఏడు లైవ్ పెయింటింగ్స్‌ను రూపొందించింది. స్టేడియంలోని మీడియా బాక్స్ నుంచి ఐదుగురు ఔత్సాహిక చిత్రకారులు మ్యాచ్‌ను వీక్షిస్తూ పెయింటింగ్స్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యార్థిని శోభిత మాట్లాడుతూ.. ‘మేము గ్రూపులుగా ఏర్పడి ఏడు పెయింటింగ్స్‌ను కాన్వాస్‌పై రూపొందించాం. ఈ మ్యాచ్‌లోని ప్రత్యేక సందర్భాలను, వైజాగ్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపును ఈ కళాఖండాలు ప్రతిబింబిస్తాయి.’అని వివరించారు.


