
తప్పుడు కేసులు పెట్టి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
అల్లిపురం: కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రతి పక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. జూన్ 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మహారాణిపేట పోలీసులు స్టేషన్‌కి రావాలని నోటీసు ఇవ్వటంతో సోమవారం వెళ్లారు. విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ష్యూరిటీలు సమర్పించిన తర్వాత బెయిల్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూస్తున్నారన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవి రెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు రవి, జీలకర్ర నాగేంద్ర, బొడ్డ గోవింద్, శ్రీదేవి, లక్ష్మి పాల్గొన్నారు.