
గిరి ప్రదక్షిణకు 2,460 మందితో బందోబస్తు
అల్లిపురం: గిరి ప్రదక్షిణకు 2,460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో వీధి లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టాయిలెట్స్, మంచినీళ్లు, అంబులెన్స్‌లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు. భక్తులను హెచ్చరిస్తూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, బీచ్‌లో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్లతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.