
అణగారిన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
మహారాణిపేట: అణగారిన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ బాబూ జగ్జీవన్‌రామ్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్‌రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటం వద్ద సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, మొల్లి అప్పారావుతో కలిసి కేకే రాజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదుగురు ప్రధానుల వద్ద కేంద్రమంత్రిగా పని చేసి, అన్ని శాఖలకు న్యాయం చేశారని కొనియాడారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవిరెడ్డి, ముఖ్యనేత జహీర్ అహ్మద్, కార్పొరేటర్లు అనిల్‌కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, బిపిన్ కుమార్ జైన్, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, సనపల రవీంద్ర భరత్, పులగం కొండారెడ్డి, రామి రెడ్డి, వంకాయల మారుతీ ప్రసాద్, బోండా ఉమా మహేశ్వరరావు, మార్కేండేయులు, జిల్లా పార్టీ కమిటీ మంచా నాగమల్లేశ్వరి, ఎం.సత్యనారాయణ, పద్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.