
వైఎస్సార్ జయంతి రోజున సేవా కార్యక్రమాలు చేయండి
సాక్షి, విశాఖపట్నం: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. వైఎస్సార్ పుట్టినరోజున వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రక్తదాన శిబిరాలు, పుస్తకాల పంపిణీ, పేదలకు అన్నదానం, దుస్తుల పంపిణీ, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ వంటి సేవాకార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ సేవాదళ్, యువజన విభాగం, విద్యార్థి విభాగం అధ్యక్షులు సేవాకార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వైఎస్సార్ సీపీ యువతంతా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు.