
నేషనల్ సిల్క్ ఎక్స్‌పో ప్రారంభం
తాటిచెట్లపాలెం: వివాహ, పండగల సీజన్ సందర్భంగా నగర వాసులకు విభిన్న వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నేషనల్ స్కిల్ ఎక్స్‌పో నిర్వాహకులు తెలిపారు. వాల్తేర్ మెయిన్‌రోడ్డులోని గ్రీన్ పార్క్ హోటల్‌లో శనివారం నేషనల్ సిల్క్ ఎక్స్‌పో ప్రారంభమైంది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రసిద్ధ పైథాని సిల్క్, సాఫ్ట్ సిల్క్, కాశిదా సిల్క్ చీరలు, చందేరి, మహేశ్వరి, బలుచారి, జామ్దాని, థగ్గిల్, తకై మస్లిన్ సిల్క్ వస్త్రాలు, లెనిన్ తదితర చీరలన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్ కం సేల్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు అంగీకరిస్తామన్నారు.