కూటమి మోసాలు ఎండగడదాం.. | - | Sakshi
Sakshi News home page

కూటమి మోసాలు ఎండగడదాం..

Jul 6 2025 6:27 AM | Updated on Jul 6 2025 6:27 AM

కూటమి

కూటమి మోసాలు ఎండగడదాం..

● ఫేక్‌ రాజకీయాలు చేసేదే చంద్రబాబు ● ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా..? ● జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, కేకే రాజు

ప్రజల పక్షాన గొంతు వినిపించాలి

ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీకి మన అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కార్యకర్తలే బలమని కొనియాడారు. ఏడాది కూటమి పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు తప్ప ఏమి లేదన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గొంతు వినిపించాలని.. కూటమి వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో పెట్టడం.. తరువాత వెబ్‌సైట్‌ నుంచి తొలగించడం చంద్రబాబుకు అలవాటని.. అందుకే మనం టెక్నాలజీతో మొబైల్లోనే మ్యానిఫెస్టో చూపిద్దామన్నారు. విశాఖలో ఎకరా 99 పైసలకే కారుచౌకగా ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని భూస్థాపితం చేస్తానని పగటి కలలు కంటున్నాడని, సోనియాగాంధీ వల్లే కాలేదు.. నువ్వేమి చేయగలవన్నారు.

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగడతామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్‌ కోఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు అన్నారు. శనివారం రుషికొండ ఏ1 గ్రాండ్‌ హోటల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా పార్టీ నేతలంతా మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ.. రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’ క్యూఆర్‌ స్కాన్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏవిధంగా మోసం చేస్తుందో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా స్కాన్‌ చేసి ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు, సంతకాలతో కూడిన మ్యానిఫెస్టో, బాండ్‌లను ఎన్నికల ముందు ఇంటింటికీ అందజేశారన్నారు. వాటిని ఇప్పుడు చెత్తబుట్టకే పరిమితం చేశారన్నారు. మ్యానిఫెస్టోలో హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే.. నాలుక మందమని చంద్రబాబు, తాటతీస్తానని పవన్‌కల్యాణ్‌ అంటున్నారని మండిపడ్డారు. సూపర్‌సిక్స్‌ హామీలు అమలు చేయకుండానే అన్ని ఇచ్చేశానని చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీని ఫేక్‌ అంటున్న ఆయన, హామీలు ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం పెద్ద ఫేక్‌, ఆరాచకాలు చేస్తున్న టీడీపీ ఫేక్‌ అని అన్నారు. ఇంతకీ ఎవరు ఫేక్‌ అనేది ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా..? అని సవాల్‌ విసిరారు. ఆగస్టులో ఉచిత బస్సు పథకం అమలు అంటున్నారు. అ వి పరిమితులతో కూడినవని లీక్‌లు ఇస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి, పీ–4 అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఏప్రిల్‌, మే నెలలో అన్నదాత సుఖీభవ అందజేస్తామని శాసనమండలిలో లోకేష్‌ చెప్పారని.. తండ్రి వంద అబద్ధాలు మాట్లాడితే.. కొడుకు 200 అబద్ధాలు, మోసాలు మాట్లాడుతున్నాడన్నారు.

● భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అన్నీ హామీలు అమలు చేశాం.. కానీ దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యాం తప్ప ప్రజల మనస్సులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రేమ, అభిమానం పోలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విశాఖలో కబ్జాలు, మోసాలు, దందాలు మాత్రమే జరుగుతున్నాయని, ప్రజల సంక్షేమం కోసం కనీసం ఆలోచన చేయడం లేదన్నారు.

● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ కూటమి పార్టీలు ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ప్రసంగాలను ఒక్కసారి ప్రజలకు గుర్తుచేయాలన్నే ఉద్దేశంతో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా మీ ముందుకు తెచ్చామన్నారు. ఈ మోసాలను గ్రామాల్లో, వార్డుల్లో ప్రతీ ఒక్కరికి వివరించాలన్నారు.

● ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఎన్‌ఏడీ అంటే నేరాలు, అత్యాచారాలు, దాడులుగా మారిందన్నా రు. ఏడాది పాలనలో రాష్ట్రంలో రోజుకు సగటున 70 మందిపై మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నట్లు హోంమంత్రే వెల్లడించారన్నారు. ఏడాదిలో ప్రజలకు ఇవ్వాల్సిన రూ.81 వేల కోట్ల సంక్షేమానికి ఎగవేశారన్నారు. కూటమి నేతలు సుపరిపాలనకు తొలి అడుగు అంటున్నారని.. సుపరిపాలనకు ఇది తుంటి అడుగు మాత్రమేనని ఎద్దేవా చేశారు.

● తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ ఈ సమావేశం పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపిందన్నారు. కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు పెట్టి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలుచేశారన్నారు. సంక్షేం, అభివృద్ధి, యువత, నిరుద్యోగుల భవిష్యత్తు అన్ని కాలరాసి.. కూటమి నాయకులు, కార్యకర్తల జేబులు నింపుకుంటున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.

● దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ బాబే మోసం.. ఎంతో మందిని తొక్కేసి వెన్నుపోటు పొడిచి ఎలా ఎదిగాడో ప్రజలందరికీ తెలుసన్నారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏడాది కాలంలో ప్రభుత్వంపై ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత లేదన్నారు. రానున్న ఎన్నికల్లో సింగిల్‌గా గెలవగలవా పవన్‌ కల్యాణ్‌ అని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికలు వస్తే నా చాప్టర్‌ క్లోజ్‌ అని మోదీ, అమిత్‌ షా కాళ్లు మీద పడుతున్న పరిస్థితి చంద్రబాబుదన్నారు.

● మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో ఏమి చేశారని ప్రజల ముందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మామను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న నాటి నుంచి నేటి వరకు పొత్తులతోనే పోటీ చేసి చంద్రబాబు అధికారం చేపట్టారన్నారు. మానిఫెస్టోలో హామీలను వంద శాతం అమలుచేసిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు.

● విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు కదిరి బాబూరావు మాట్లాడుతూ బాబు వస్తే జాబ్‌ గ్యారెంటీ అన్నారు. నిరుద్యోగులకు భృతి అన్నారు. ఇలా రైతు నుంచి విద్యార్థి వరకు అన్ని వర్గాల వారిని ఈ ప్రభుత్వం మోసం చే స్తోందన్నారు.

● గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్న అడుగు జాడల్లో మనం అడుగు వేసి కూటమి మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, పసుపులేటి బాలరాజు, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, తైనాల విజయకుమార్‌, చింతలపూడి వెంకటరామయ్య, మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌ కె.సతీష్‌, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగల అధ్యక్షులు బొల్లవరపు జాన్‌ వెస్లీ, పేర్ల విజయ్‌ చందర్‌, జీవిఎంసీ ఫ్లోర్‌ లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, ముఖ్యనేతలు రొంగలి జగన్నాథం, జియ్యాని శ్రీధర్‌, ఉరుకూటి అప్పారావు, వుడా రవి, ఐహెచ్‌ ఫరూఖీ, బోని శివరామకృష్ణ, అల్లు శంకర్‌రావు, పిల్లా సుజాత సత్యనారాయణ, పోతిన శ్రీనివాసరావు, పిల్లి సుజాత నూకరాజు, అల్లంపల్లి రాజుబాబు, దాట్ల వెంకట అప్పల ప్రసాద్‌ రాజు, మహంతి, మంతెన మాధవి వర్మ, పల్లా చిన్నతల్లి, డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌, సతీష్‌ వర్మ, మంత్రి రాజశేఖర్‌, నడిపంపల్లి కృష్ణంరాజు, బోని బంగారు నాయుడు, చెన్నా జానకీరామ్‌, గల్లా శ్రీనివాస్‌, గండ్రెడ్డి శ్రీనివాస్‌, మువ్వల సురేష్‌, ద్రోణంరాజు శ్రీ వాస్తవ, బాకీ శ్యామ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అబంటి శైలేష్‌ , ఉరుకూటి చందు, పేడాడ రమణి కుమారి, బోని అప్పలనాయుడు, సనపల రవీంద్ర భరత్‌, బర్కత్‌ అలీ, పులగం కొండా రెడ్డి, మామిడి శివ రామకృష్ణ, సేనాపతి అప్పారావు, పీలా ప్రేమ కిరణ్‌ జగదీష్‌, రామి రెడ్డి, చిక్కాల సత్యనారాయణ, అనిల్‌ కుమార్‌, కల్పన, దిలిప్‌ కుమార్‌, బాజీ నాయుడు, మారుతీ ప్రసాద్‌, బోండా ఉమామహేశ్వర రావు, వాసుపల్లి యల్లాజీ, జీలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కేండేయులు, నీలి రవి, శ్రీదేవివర్మ, బయ్యవరపు రాధ, పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర అనుబంధ విభాగం ఉపాధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం జోనల్‌ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం ప్రధాన కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు, పార్టీ జిల్లా అధికారి ప్రతినిధులు, మండల, డివిజన్‌ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగం సభ్యులు, మండల, వార్డు, జిల్లా కమిటీ సభ్యులు, మండల, జిల్లా అనుబంధ విభాగం కమిటీ సభ్యులు, డివిజన్‌ అనుబంధ విభాగం అధ్యక్షులు, పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

హాజరైన పార్టీ

కార్యకర్తలు

‘బాబు ష్యూరిటీ–మోసాలు గ్యారెంటీ’ పేరిట చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు చేద్దాం

విలువలు, విశ్వసనీయత అంటేనే జగన్‌

పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ గత ఐదేళ్లలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలను పరిచయం చేసిందే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కొనియాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారం చేపట్టిన మరుక్షణం అమలుచేశాన్నారు. కూటమి నేతలు సూపర్‌ సిక్స్‌తోపాటు 140కి పైగా హామీలు ఇచ్చి గద్దెనెక్కాక వాటిని విస్మరించారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి రీకాలింగ్‌ బాబుస్‌ మానిఫెస్టో పేరిట చంద్రబాబు హామీలన్నీ గుర్తు చేయాలన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, వార్డుల్లో కూడా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు కూటమి మోసాలు, వైఫల్యాలను వివరిద్దామన్నారు.

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు

రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ పీ4తో పేదరికం పోగొట్టగలరా..? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నాడన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా పాలన సాగిందన్నారు. ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ‘ పేరిట ప్రతి ఇంటికి వెళ్లి క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా రీకాలింగ్‌ బాబుస్‌ మానిఫెస్టో పేరిట వివరించాలన్నారు.

కూటమి మోసాలు ఎండగడదాం.. 1
1/4

కూటమి మోసాలు ఎండగడదాం..

కూటమి మోసాలు ఎండగడదాం.. 2
2/4

కూటమి మోసాలు ఎండగడదాం..

కూటమి మోసాలు ఎండగడదాం.. 3
3/4

కూటమి మోసాలు ఎండగడదాం..

కూటమి మోసాలు ఎండగడదాం.. 4
4/4

కూటమి మోసాలు ఎండగడదాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement