
వైఎస్సార్ సీపీ కమిటీల్లో విశాఖ నేతలకు చోటు
తాటిచెట్లపాలెం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు నగరానికి చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యార్థి విభాగం జాయింట్ సెక్రటరీగా బానాల తరుణ్‌కుమార్ (విశాఖ ఉత్తర), రాష్ట్ర వలంటీర్స్ విభాగం జనరల్ సెక్రటరీగా పులుగం శ్రీనివాసరెడ్డి(విశాఖ తూర్పు), రాష్ట్ర వలంటీర్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా బుస అప్పలనాయుడు (విశాఖ పశ్చిమ), రాష్ట్ర సోషల్ మీడియా విభాగం సెక్రటరీగా గోపిరాజు వంక (విశాఖ పశ్చిమ), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శులుగా జి.గణేష్‌రెడ్డి (విశాఖ తూర్పు), నమ్మి నాగేశ్వరరావు(విశాఖ ఉత్తర), రాష్ట్ర ఆర్టీఐ విభాగం సెక్రటరీగా సింగారపు సత్యనారాయణ (విశాఖ పశ్చిమ), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా ప్రగడ ప్రసాద్ (గాజువాక) నియమితులయ్యారు.