
బాలికపై లైంగికదాడికి యత్నం
బీచ్‌రోడ్డు: నగరానికి చెందిన బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో స్విగ్గీ డెలివరీ బాయ్ పిన్నింటి చంద్రశేఖర్‌ను మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన మద్దిలపాలెం సీఎంఆర్ వెనుక వైపున ఉన్న వినాయక్ నగర్‌లో జరిగింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ కొన్నేళ్లుగా వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటూ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చంద్రశేఖర్ ఉంటున్న ఇంటి కిందనే ఏడో తరగతి చదువుతున్న బాలిక కుటుంబం ఉంటోంది. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో చంద్రశేఖర్ ఆ బాలికను తన ఇంటికి పిలిచాడు. బాలిక పైకి రాగానే ఆమైపె లైంగిక దాడికి యత్నించాడు. దీంతో బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు చేరుకుని ఆమెను రక్షించారు. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు జరిగిన విషయంపై మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు చంద్రశేఖర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.