
పరశురాముడిగా జగన్నాథుడు
డాబాగార్డెన్స్: టర్నర్ చౌల్ట్రీలో వేంచేసియున్న జగన్నాథస్వామిని దర్శించుకునేందుకు గురువారం భక్తులు బారులు తీరారు. దీంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దశావతారాల్లో భాగంగా స్వామి పరశురామావతారంలో దర్శనమివ్వగా.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథయాత్రలో భాగంగా శుక్రవారం జగన్నాథ స్వామి శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.