
రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం
దేవదాయ భూముల పరిరక్షణకు చర్యలు
8లో
వేదిక రుషికొండలోని ఏ1 గ్రాండ్ హోటల్
సాక్షి, విశాఖపట్నం: రుషికొండలోని ఏ1 గ్రాండ్ హోటల్ లో ఈ నెల 5న వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు తెలిపారు. సమావేశంలో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ‘బాబు ష్యూరిటీ.. మోసాలు గ్యారెంటీ’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ఎంపీ గొల్ల బాబూరావు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో ని అన్ని నియోజవర్గాల సమన్వయకర్తలు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.