
చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేద్దాం
● 5న ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’కార్యక్రమం ● విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపు
మహారాణిపేట: వెంకోజీపాలెంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాలులో ఈ నెల 5న నిర్వహించనున్న ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు పిలుపునిచ్చారు. మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంస్థల నాయకులతో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి నుంచి మండల, వార్డు, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.
కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు
జిల్లా స్థాయి ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మళ్ల విజయ ప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డితో పాటు శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ మేయర్ హాజరవుతారని కె.కె.రాజు వెల్లడించారు. ఈ సమావేశంలో సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ ముఖ్య నాయకులు ఫరూక్, సతీష్ వర్మ, ద్రోణంరాజు శ్రీవాత్సవ, అల్లంపల్లి రాజాబాబు, అనుబంధ విభాగం అధ్యక్షులు ఉరుకూటి రామచంద్ర రావు, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, వంకాయల మారుతీ ప్రసాద్, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమా మహేశ్వర రావు, కర్రి రామారెడ్డి, బర్కత్ అలీ, పులగం కొండా రెడ్డి, సేనాపతి అప్పారావు, బోని శివ రామకృష్ణ, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, చిక్కాల సత్యనారాయణ, జోన్ విభాగం అధ్యక్షులు అంబటి నాగ వినాయక శైలేష్, కార్పొరేటర్లు రెయ్యి వెంకట రమణ, కరజాడ వెంకట నాగ శశికళ, పద్మా రెడ్డి, అనుబంధ విభాగం రాష్ట్ర నాయకులు నీలి రవి, నీలపు కాళిదాస్ రెడ్డి, బెందాళం పద్మావతి, కె.వి.బాబా, బయ్యవరపు రాధ, ఈతలపాక విజయ భాస్కర్, తుమ్మలూరు జగదేష్ రెడ్డి, ఆకెళ్ల వెంకట రమణ మూర్తి, సరగడం పతిని రావు, ప్రగడ ప్రసాద్, బెవర జగదీశ్వరరావు, గోపిరాజ్ వంక, జగుపిల్ల నరేష్, కనకళ ఈశ్వరరావు, మల్లా దేవి విశాలి, బోస రామ లక్ష్మి, బొర్రా విజయలక్ష్మి, కాంట్రేడి రామన్న పాత్రుడు, తుల్లి చంద్రశేఖరరావు, పోతిబంతి హరికృష్ణ, రేఖ ఉషా రాణి, బాణాల తరుణ్ కుమార్, చేకూరి హరీష్ వరం, పులగం శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.