వ్యాక్సిన్‌.. నెమ్మదించెన్‌! | - | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌.. నెమ్మదించెన్‌!

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

అపోహలు తొలగిస్తున్నాం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గర్భాశయ ముఖద్వారా కేన్సర్‌ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) టీకాల కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో మందకొడిగా సాగుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 30 శాతం దాటకపోగా, వికారాబాద్‌ జిల్లాలో 15 శాతం కూడా మించలేదు. టీకాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వెరసి టీకాల వెనుకబాటుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రంగారెడ్డి జిల్లాలో..

14 నుంచి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలు 21,375 మంది ఉన్నట్లు గుర్తించారు. కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, ఆరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 38 ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 453 మంది బాలికలు, బాలాపూర్‌లో 302 మంది, మైలార్‌దేవ్‌ల్లిలో 285 మంది, కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రిలో 242 మంది, చేవెళ్లలో 221 మంది, కొత్తూరులో 200 మంది, మొయినాబాద్‌లో 182 మంది, సరూర్‌నగర్‌లో 174 మంది, బూర్గులలో 155 మంది, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 150 మంది, మహేశ్వరంలో 147 మంది, శేరిలింగంపల్లిలో 147 మంది, శంకర్‌పల్లిలో 133 మంది బాలికలు టీకాలు తీసుకున్నారు.

వికారాబాద్‌ జిల్లాలో..

ీసీఎం సహా స్పీకర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్‌ జిల్లాలోనూ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఘోరంగా విఫలమైంది. జిల్లాలో 14 నుంచి 15 ఏళ్లలోపు కిషోర బాలికలు 6,010 మంది ఉన్నట్లు గుర్తించారు. టీకాల కోసం జిల్లా ఆస్పత్రి సహా జీజీహెచ్‌, 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. 639 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటి వరకు 1,549 మంది (15శాతం) మాత్రమే టీకాలు వేయించుకున్నారు. యాలాలో 183 మంది, తాండూరులో 100 మంది, కుల్కచర్లలో 107 మంది, కొడంగల్‌లో 105 మంది, వికారాబాద్‌లో 70 మంది బాలికలు మాత్రమే టీకాలు వేయించుకోవడం గమనార్హం.

హెచ్‌పీవీ అంతంతే!

దూరంగా ఉమ్మడి జిల్లా బాలికలు

రంగారెడ్డి జిల్లాలో 30 శాతం, వికారాబాద్‌లో 15 శాతమే నమోదు

నెరవేరని ప్రభుత్వ లక్ష్యం

పట్టించుకోని వైద్యఆరోగ్యశాఖ

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై తల్లిదండ్రుల్లో పలు అపోహలు, అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. టీకా తీసుకోవడంతో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. 0.5 ఎంఎల్‌ టీకా వేస్తాం. భవిష్యత్తుల్లో పిల్లలకు గర్భాశయ ముఖద్వారా కేన్సర్‌ రాకుండా ఉండేందుకే ఈ టీకాలు వేస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో టీకాకు వేలల్లో చార్జీ చేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ స్వర్ణకుమారి, డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డి

అంశం రంగారెడ్డి వికారాబాద్‌

14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు 21,375 10,610

టీకా వేయించుకున్నవారు 6,039 1,549

జిల్లాకు చేరిన వాక్సిన్లు 30,000 15,000

టీకా ఇచ్చే కేంద్రాలు 46 31

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement