బాలికల భద్రతకే షీటీం | - | Sakshi
Sakshi News home page

బాలికల భద్రతకే షీటీం

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

అనంతగిరి: బాలికలు, మహిళల భద్రతే షీటీం లక్ష్యమని షీటీం ఇన్‌చార్జి బుచేందర్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్‌ మండలం జైదుపల్లి ప్రభుత్వ పాఠశాలలో షీటీంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డయల్‌ 100, 181 ప్రాధాన్యతను వివరించారు. రోడ్డు భద్రత నియమాలు, సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ రూల్స్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైదుపల్లి ప్రభుత్వ పాఠశాల జీహెచ్‌ఎం అబ్దుల్‌ ఖవి, ఉపాధ్యాయులు, పోలీస్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement