శ్రీవారి ఆలయ నవీకరణ పనులు షురూ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయ నవీకరణ పనులు షురూ

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

శ్రీవారి ఆలయ నవీకరణ పనులు షురూ ఆర్టీసీ పరిగి డీఎంగా ఇసాక్‌ బిన్‌ మహ్మద్‌ కర్ణాటక సీఎంకు టీఆర్‌ఆర్‌ శుభాకాంక్షలు రిజిస్ట్రేషన్‌ శాఖ పెంచిన విలువ తగ్గించాలి

కొడంగల్‌: పట్టణంలోని బాలాజీనగర్‌లో శ్రీవారి ఆలయ పునఃనవీకరణ పనులు ప్రారంభయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శ్రీవారి ఆలయానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణం చేపట్టనున్నారు. సంప్రదాయ నిర్మాణ శైలితో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోకంగా ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్‌, కల్యాణ మండపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా, ఆలయ ధర్మకర్తలు నందారం రత్నం, మధు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.

పరిగి: ఆర్టీసీ పరిగి డిపో మేనేజర్‌గా ఇసాక్‌ బిన్‌ మహ్మద్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కృష్ణమూర్తి పదోన్నతిపై మహబూబ్‌నగర్‌ డీఆర్‌ఎంగా బదిలీ అయ్యారు. హైదరాబాద్‌ రీజియన్‌ కార్గో ఏటీఎంగా విధులు నిర్వహిస్తున్న ఇసాక్‌ బిన్‌ మహ్మద్‌ పదోన్నతిపై పరిగి డీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

పరిగి: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ పదవీబాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూర్‌లోని డీకే శివకుమార్‌ నివాసంలో టీఆర్‌ఆర్‌ కుమార్తె మేఘనారెడ్డితో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ని కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ

ఐజీకి వినతి

తాండూరు: మార్కెట్‌ విలువకన్నా రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్ణయించిన మార్కెట్‌ విలువ అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డాక్యుమెంట్‌ రైటర్స్‌ అసోసియేషన్‌ తాండూరు ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు శనివారం వారు నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో బుయ్యని మనోహర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. మార్కెట్‌ ధరల విలువను తగ్గించేలా రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ శాఖల ఐజీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సంభందిత శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంత్‌తో మాట్లాడి తాండూరు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఫోన్‌లో చెప్పారు. ఎమ్మెల్యే సూచన మేరకు డాక్యుమెంట్‌ రైటర్లు ఐజీని కలిసి సమస్యను వివరించారు. మరోవైపు రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రెండు మూడు రోజులకు ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ మారుతున్నారని దీంతో రిజిస్ట్రేషన్‌లు ఆశించిన స్థాయిలో కావడం లేదని ఐజీ చెప్పారు. వెంటనే తాండూరుకు సబ్‌ రిజిస్ట్రార్‌ను నియమించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement