అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్‌లు రద్దు

అడిషనల్‌ కలెక్టర్‌

ఉమాశంకర్‌ ప్రసాద్‌

పరిగి: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ పరిశీలించి ఎంత శాతం ఎరువులను విక్రయించారో తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేషించి ధరలకే ఎరువులను విక్రయిస్తూ రైతులకు రశీదు ఇవ్వాలన్నారు. ప్రతి రోజు స్టాక్‌ రిజిస్టర్‌లో ఎరువుల వివరాలను నమోదు చేయాలని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట వ్యవసాయ అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement