● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు
● జిల్లా వ్యాప్తంగా 55,036 కేసులకు పరిష్కారం
అనంతగిరి: లోక్ అదాలత్‌లల్లో రాజీతో ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. శనివారం వికారాబాద్‌లోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా జిల్లాలోని నాలుగు కోర్టులకు సంబంధించి మొత్తం 55,036 కేసులు రాజీ పడ్డారు. ఇందులో భూములకు సంబంధించినవి–9, ప్రీలిటిగేషన్–48,457, 6,560 క్రిమినల్ కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు మాట్లాడుతూ.. లోక్ అదాలత్ దేశంలోని అన్ని కోర్టుల్లో కొనసాగుతుందని ఇరువర్గాలు విశాల దక్పథంతో ఆలోచిస్తే కేసు నుంచి విముక్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి ప్రదీప్‌నాయక్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ జడ్జి శాంతిలత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి వైష్ణవి, ఎస్పీ స్నేహ మెహ్ర, పీపీలు మేరాజ్ పెర్దోష్, సమీనాబేగం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లవకుమార్, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు వసుఽంధర, న్యాయవాదులు పాల్గొన్నారు.


