విద్యార్థుల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంచాలి

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి మహ్మద్‌ అబ్దుల్‌గని అన్నారు. శనివారం ఆయన మున్సిపల్‌ పరిధిలోని నస్కల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేటుకు దీటుగా వసతులను కల్పిస్తోందని తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. పదోతరగతిలో వచ్చిన ఫలితాలను ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేటు పాఠశాలలకు వ్యత్యాసాలను చూపుతూ విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పది ఫలితాలపై ఇప్పటి నుంచే కార్యచరణ రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పక పాటించాలని చెప్పారు. అల్పాహారం ఎలా అందుతుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతంగా రాణించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి అంజయ్య తదితరులు ఏన్నారు.

జిల్లా విద్యాధికారి అబ్దుల్‌గని

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement