ఫీజుల దోపిడీని అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఫీజుల దోపిడీని అరికట్టాలి

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య

అనంతగిరి: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సంఘం సభ్యులతో కలిసి మండల విద్యాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద, మధ్య తరగతి తల్లిదండ్రులపై ఫీజుల భారం మోపుతున్నాయన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డొనేషన్లు, ఇతర పేర్లతో అదనపు వసూల్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతిరెడ్డి, శోభన్‌, మహబూబ్‌అలీ, కృష్ణ, జుబేర్‌, సందీప్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement