తాండూరు: మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగమైన పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ప్రతి నెల వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానని మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత చైర్‌పర్సన్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం డాక్టర్లు కార్మికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో కార్మికులు వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు. అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. కార్మికుల ఆరోగ్య భద్రతకు కిట్‌ల పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ రాకేష్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మెనేజర్ నరేందర్‌రెడ్డి, ఇన్‌చార్జి శానిటరి ఇన్‌స్పెక్టర్ రాములు, వైద్యులు వీరారెడ్డి, శ్రీధర్, అఖిల్, వెంకటేశ్ పాల్గొన్నారు.


