నిర్మించారు.. వదిలేశారు
బంట్వారం: లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మీటింగ్ హాల్.. 15 సంవత్సరాలు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. మండల కేంద్రంలో నాడు హాల్ నిర్మాణ పనులు చేపట్టారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులను నాటి జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి జెడ్పీ నిధులు మంజూరు చేశారు. భవనం పూర్తయినప్పటికీ.. చిన్నపాటి పనులు మిగిలి ఉన్నాయి. వాటి కోసం ఎనమిదేళ్ల క్రితం ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అదనంగా మరో రూ.5 లక్షలు నిధులు మంజూరు చేశారు. అయినప్పటికీ.. ఆ పనులు పూర్తి కాలేదు. భవనం వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం బూత్ బంగ్లాను తలపిస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, నిర్మాణ పనులు పూర్తి చేయించి, భవనాన్ని వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


