ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

పరిగి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేవారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేశామన్నారు. రైతుల పక్షపాతి కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకుండా చేతులెత్తయడం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. కేసీఆర్‌ 11 సార్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తే.. కాంగ్రెస్‌ రైతు భరోసా ఇవ్వకుండా దోపిడీ చేస్తోందని మండి పడ్డారు. కంపెనీలకు బీమా సొమ్ము చెల్లించకపోవంతో రైతుబీమా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ధాన్యం విక్రయించేందుకు, విత్తనాలకు, ఎరువుల కొనుగోలు ఇబ్బందులు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అశోక్‌కుమార్‌, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మాణిక్యం, మాజీ ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, నాయకులు తాహేర్‌అలీ, రవీందర్‌, రాజేందర్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement