యాలాల: డీఎస్సీ 2003 ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని తపస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒంగోనిబాయి శ్రీనివాస్, ఆకుల శ్రీశైలం డిమాండ్ చేశారు. శనివారం పీఎం బాలుర ఉన్నత పాఠశాలలో తపస్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పీఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఫిట్‌మెంట్ ప్రకటించాలని కోరారు. ఈహెచ్‌ఎస్ విధివిధానాలు ఖరారు చేయకుండా, వేతనంలో కోత విధించడం సరికాదన్నారు. 190 జీఓ విద్యాశాఖలో అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. కేజీబీవీ సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు అమలు చేసి, జులై మొదటి వారంలోగా స్కూల్ గ్రాంట్స్ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సిద్రామేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, జిల్లా సహ కార్యదర్శి రాజు, నియోజకవర్గ కన్వీనర్ జడల చంద్రశేఖర్, నరేష్, కొత్త శ్రీనివాస్, నరేష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


