ప్రాణాలు కాపాడిన సీట్‌బెల్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు కాపాడిన సీట్‌బెల్ట్‌

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

నుజ్జునుజ్జయిన వాహనం

ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలు

దుద్యాల్‌: కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం దుద్యాల్‌ గేట్‌ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మహారాష్ట్ర నుంచి కర్నూల్‌కు ప్రయాణిస్తున్న కారు అతివేగం కారణంగా దుద్యాల్‌ గేట్‌ సమీపంలోని ఓ మలుపు వద్ద అదుపుతప్పింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు సీట్‌ బెల్ట్‌ ధరించడంతో ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుని స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను వెంటనే కొడంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విద్యుత్‌ స్తంభం మూడు ముక్కలవడంతో రెండు గంటలపాటు విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనంతరం కొత్త స్తంభం ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించారు. కాగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement