స్వేచ్ఛగా ఓటేయండి
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు రూరల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. సోమవారం పెద్దేముల్ ఎస్‌ఐ శంకర్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని గాజీపూర్‌లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ.. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు గ్రామాల్లో శాంతిభద్రతలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గొడవలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ చౌహన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.


