ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు
మోమిన్‌పేట: పంచాయతీ ఎన్నికలను పక్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ సృజనాసాహిత్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పంచాయతీ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారుల(పీఓ)కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఓలు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. అలసత్వం వహిస్తే ఇబ్బందులుంటాయని చెప్పారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌కు అనుమతులు ఇవ్వాలని ఆమె తెలిపారు. క్యూలో నిలబడితే ఎక్కువ సమయం కేటాయించాలని ప్రతీ విషయంపై ఉన్నాతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికలను చేతులేత్తే సంస్కృతితో చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ యాదగిరి, మండల వ్యవసాయాధికారి రామకృష్ణారెడ్డి, ఎన్నికల పీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ సృజనాసాహిత్య


