బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
అనంతగిరి: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ జిల్లా కో కన్వనీనర్ శ్రీధర్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతోనే గ్రామాల అభివ్ధృద్ధి సాధ్యమన్నారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాలకు నేరుగా అందజేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నానరి చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి రూ.పది లక్షలు కేటాయిస్తానని చెప్పారు. కాంగ్రెస్ సైతం బీఆర్‌ఎస్ తోవలోనే నడుస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి 17 శాతంతోనే సరిపెట్టిందని మండిపడ్డారు. ఆరుగ్యారెంటీల అమలు చేస్తామని చెప్పి రెండేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్‌ఎస్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు తమ సొంత డబ్బులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడితే బిల్లులు ఇవ్వకుండా వారిని అప్పుల పాలుచేసిందని ఆవేదన వెల్లిబుచ్చారు. మోదీ గ్రామాలకు నేరుగా పంపిన ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించారని ఆరోపించారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.
కోతులను పట్టే వాహనం ప్రారంభం
జిల్లాలో కోతుల బెడద కారణంగా రైతులకు పంట నష్టం వాటిల్లుతోంది. ఇందుకు జేకేఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోతులు పట్టే వాహనాన్ని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. రైతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు శివరాజు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, జిల్లా కోకన్వీనర్ శ్రీధర్‌రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటర్ వడ్ల నందు, సీనియర్ నాయకులు పాండుగౌడ్, సుచరితారెడ్డి, నరోత్తంరెడ్డి, విజయభాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, వివేకానందారెడ్డి, చరణ్‌రెడ్డి, అనిల్‌యాదవ్ పాల్గొన్నారు.
ఎంపీ నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.పది లక్షలు
గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి చేసింది శూన్యం
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


