భద్రతాభావాన్ని నింపేందుకే ఫ్లాగ్ మార్చ్
బొంరాస్‌పేట: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు ప్రజల్లో భద్రతాభావాన్ని నిపేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బొంరాస్‌పేట, తుంకిమెట్లలో పోలీసు భద్రతా బలగాలు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండల పరిధిలోని బొంరాస్‌పేట, వడిచర్ల, తుంకిమెట్ల, మహంతీపూర్‌ను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించామని ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రత్యేక భద్రతాబలగాలను మోహరింపజేశామన్నారు.
డీఎస్పీ శ్రీనివాస్


