 
															ఇలా పట్టుకున్నారు.. అలా వదిలేశారు!
పరిగి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నట్టే పట్టుకుని వదిలేశారు!. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం పట్టణ కేంద్రంలోని హైదారాబాద్ వైపు నుంచి పరిగి పట్టణం వైపు ఓ ట్రాక్టర్‌లో అక్రమంగా ఫిల్టర్ ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు.. పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేవని గుర్తించి ఆ ట్రాక్టర్‌ను ఠాణాకు తరలించారు. అప్పటి వరకు బాగానే ఉన్నా.. గంటల వ్యవధిలో సీన్ రివర్స్ అయింది. సాయంత్రం లోపు ట్రాక్టర్‌ను వదిలేశారు. ఇదే విషయమై ఎస్‌ఐ మోహనకృష్ణను వివరణ కోరగా.. ట్రాక్టర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని సమాధానం ఇచ్చారు. ఉదయం 9 గంటలకు పట్టుకున్న ట్రాక్టర్‌కు అప్పుడు అనుమతులు లేవా అని, మధ్యాహ్నానికి పర్మిషన్ ఎలా వచ్చిందని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఫిల్టర్ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌కు.. ఇందిరమ్మ ఇళ్ల అనుమతులు తీసుకువచ్చి చేతులు దులుపుకొన్నట్లు సమాచారం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
