 
															సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు కార్డులు
● కొడంగల్ పట్టణంలోనే
విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి
● కేడీపీ జేఏసీ నాయకుల వినతి
కొడంగల్ రూరల్: కొడంగల్ పట్టణ పరిధిలోనే విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలంటూ కేడీపీ జేఏసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టు కార్డులు పంపారు. గురువారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పోస్టు కార్డులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పుర ప్రముఖులు, విద్యావంతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జేఏసీ కో కన్వీనర్లు శ్రీనివాస్, వెంకటయ్య మాట్లాడారు. కొడంగల్ పట్టణానికి కేటాయించిన మెడికల్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు, సమీకృత గురుకులాలను ఇక్కడే నిర్వహించాలని కోరారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తే కొడంగల్ అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు పవన్‌కుమార్ లాహోటి, పల్లెగేరి బస్వరాజ్, పకిరప్ప, చిన్నయ్య, నవీన్‌సింగ్, మదన్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి రిలే నిరాహారదీక్షలు
పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. కొడంగల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు సురేష్, శ్రీనివాస్, రమేష్‌బాబు, భీమరాజు, సూర్యానాయక్ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
