 
															కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించాలి
తాండూరు రూరల్: ఉద్యోగ విరమణ పొందిన కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం చెల్లించాల్సిన గ్రాట్యుటీ చెల్లించాలని సీసీఐ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శరణప్ప డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధి కరన్‌కోట్ గ్రామ సమీపంలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ఫ్యాక్టరీ వద్ద.. విశ్రాంత కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన వారికి చాలా ఏళ్లుగా యాజమాన్యం గ్రాట్యుటీ చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయమై హైదరాబాద్‌లోని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. కాంట్రాక్టు కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని ఆర్డర్‌కాఫీ జారీ చేశారని తెలిపారు. లేబర్ కమిషనర్ ఆర్డర్ కాఫీ జారీ చేసి నెల రోజులు అవుతున్నా.. సీసీఐ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విమర్శించారు. త్వరలో గ్రాట్యుటీ చెల్లించకపోతే సీసీఐ యాజమాన్యంపై జాతీయ లేబర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
