కూలీలందరికీ పని కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

కూలీలందరికీ పని కల్పిస్తాం

Oct 27 2025 8:54 AM | Updated on Oct 27 2025 8:54 AM

కూలీల

కూలీలందరికీ పని కల్పిస్తాం

యువకుడి ఆత్మహత్య

ఈజీఎస్‌ టీఏ అశోక్‌రెడ్డి

బంట్వారం: జాబ్‌కార్డు ఉన్న కూలీందరికీ ఉపా ధిహమీ పని కల్పిస్తామని ఈజీఎస్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ అశోక్‌రెడ్డి అన్నారు. లేబర్‌ బడ్జెట్‌లో భాగంగా ఆదివారం ఆయన రొంపల్లి, మంగ్రాస్‌పల్లిలో 2025–26 సంవత్సరానికి గానూ గ్రామ సభలు నిర్వహించి మాట్లాడారు. కొత్తగా చేపట్టే పనులు ఇతర అంశాలపై గ్రామస్తులో చర్చించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శేఖర్‌, రైతులు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి

బీజేపీ జిల్లా కన్వీనర్‌ ప్రహ్ల్లాదరావు

కుల్కచర్ల: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మన్‌కీబాత్‌ కార్యక్రమ వీక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్‌కీబాత్‌ మండల కన్వీనర్‌గా పార్టీ మండల అధ్యక్షుడు కొండ ఆంజనేయులును నియమించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరావు మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు, మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలన్నారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రధాని సందేశాన్ని ఎక్కువ మంది వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దిశ జిల్లా కమిటీ సభ్యుడు జానకిరాం, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు మైపాల్‌, నాయకులు మల్లేశ్‌, శ్రీశైలం, అంజిలయ్య పాల్గొన్నారు.

భార్యే హంతకురాలు!

అనుమానాస్పద మృతి కేసులో

కీలక మలుపు

మీర్‌పేట: అనుమానాస్పదంగా మీర్‌పేట జిల్లెలగూడలో ఈ నెల 20వ తేదీన వ్యక్తి మృతి చెందిన కేసులో భార్యే భర్తను హతమార్చినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయినట్లు తెలిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లెలగూడ ప్రగతినగర్‌కు చెందిన ఆలంపల్లి విజయ్‌కుమార్‌(42) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య సంధ్య స్థానిక మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి, తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. 20వ తేదీ అర్ధరాత్రి ఆయన మద్యం మత్తులో భార్యతో గొడవ పడ్డాడు. విచక్షణ కోల్పోయిన సంధ్య నీరు చేదే బకెట్‌ తాడును మెడకు బిగించి విజయ్‌కుమార్‌ను హత్య చేసింది. అనంతరం బాత్‌రూమ్‌ వద్ద పడేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని తల్లి సత్తెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో తానే భర్తను హతమార్చినట్లు సంధ్య అంగీకరించినట్లు తెలిసింది. సోమవారం ఆమెను పోలీసులు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది.

కీసర: భవనంపై నుండి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కీసర ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అహ్మద్‌గూడ రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉండే యాదగిరి కుమారుడు విష్ణువర్థన్‌(20)కు అదే కాలనీకి చెందిన నర్సింగ్‌రావు , హరిలతో మధ్య శనివారం గొడవ జరిగింది.దీంతో మనస్తాపానికి గురైన విష్ణువర్థన్‌ శనివారం రాత్రి కాలనీలో ఉన్న భవనం పైకి ఎక్కి కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కూలీలందరికీ పని కల్పిస్తాం 1
1/1

కూలీలందరికీ పని కల్పిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement