 
															పాడైనగుడ్లు పంపిణీ
తాండూరు రూరుల్: గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్లను పంపిణీ చేస్తోంది. ఆదివారం కందనెల్లి, ఆత్కూర్ గ్రామంలో పాడైన గుడ్ల పంపిణీ సంఘటన వెలుగులోకి వచ్చింది. లబ్ధిదారులు తెలిపిన వివరాల ప్రకారం.. కందనెల్లి గ్రామానికి చెందిన శ్వేత గర్భిణి. ఈ నెల 18వ తేదీన సదరు అంగన్‌వాడీ టీచర్ 11 గుడ్లు అందజేశారు. శనివారం కొన్నింటిని ఉడకబెట్టేందుకు తీసింది. అవి ఎంతకి ఉడకకపోవడంతో మరికొన్నింటిని పగలగొట్టి చూడగా అవి పాడైనట్లు గుర్తించింది. ఆత్కూర్ గ్రామంలో 22వ తేదీన ఇద్దరు చిన్నారులకు 16 గుడ్లను సంబంధిత టీచర్ అందజేసింది. వాటిని కూడా ఇంటికొచ్చి చూశారు. అవి కూడా పాడైనట్లుగా గుర్తించినట్లు తండ్రి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంగన్‌వాడీల తీరును తప్పుబట్టారు. మురిగిన గుడ్లను ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వాటిని ఎలా తినాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సీడీపీఓ కాంతరావును వివరణ కోరగా..సూపర్‌వైజర్లను పంపించి విచారణ చేయిస్తామని ఆయన బదులిచ్చారు.
అంగన్‌వాడీల తీరుపై ఆగ్రహం
ఇబ్బందుల్లో లబ్ధిదారులు
పట్టించుకోని అధికారులు
 
							పాడైనగుడ్లు పంపిణీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
