 
															30లోపు బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి
అనంతగిరి: రైస్ మిల్లర్లు ఈ నెల ్డ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బ్యాంక్ గ్యారంటీలు, అగ్రిమెంట్లు, ఖరీఫ్‌కు సంబంధించిన సీఎంఆర్ తదితర అంశాలపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు వంద శాతం బ్యాంకు గ్యారంటీలతో పాటు అగ్రిమెంట్లను అందజేయాలన్నారు. 2024 – 25 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ సీజన్ సీఎంఆర్‌ను నవంబర్ 12లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో లక్ష 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలతో మిల్లర్లు సిద్ధంగా ఉండాలని, అందుకనుగుణంగా ఏర్పాటు సమకూర్చుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్‌కృష్ణ, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాలేశ్వర్ గుప్తా, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
